ఆంధ్ర ప్రదేశ్

నక్షా పేరిట ప్రభుత్వం కీలక నిర్ణయం!.. ఇకపై భూ వివాదాలు ఉండబోవు?

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఎక్కడ చూసినా కూడా భూముల విషయం వద్ద తగాదాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఈ భూవివాదాలను పరిష్కరించుకునేందుకు చాలా మంది రెవిన్యూ కార్యాలయాల వెంబడి లేదా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఒకవైపు డబ్బులను మరోవైపు ఆరోగ్యాన్ని కూడా కోల్పోతారు. కానీ ఎన్ని రోజులు గడిచినా కూడా ఆ సమస్య మాత్రం పరిష్కారం కాదు. ఈ భూవివాదాలను దృష్టిలో ఉంచుకున్న కూటమి ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం చూడాలని భావించింది. ఇలాంటి భూవివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. దీనికి నక్షా కార్యక్రమం అని పేరు సృష్టించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని భూవివాదాలను పరిష్కరించే విధంగా నక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. తాజాగా జాతీయస్థాయి వర్క్ షాప్ లో కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ తో పాటుగా కలిసి మంత్రి నారాయణ హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 152 మున్సిపాలిటీల్లో భూ సర్వే చేయనున్నారు. ఇక ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి పది మున్సిపాలిటీలు పైలెట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. మొత్తం 9.5 లక్షల ఆస్తులను సర్వే చేసి రికార్డులను పూర్తిగా డిజిటల్ విశేషం చేస్తారు. ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎనిమిది మున్సిపాలిటీలో ఏరియల్ సర్వే పూర్తయినట్లు మంత్రి నారాయణ వెల్లడించడం జరిగింది. ఈ లక్ష కార్యక్రమం పూర్తి అయితే కచ్చితంగా రాష్ట్రంలో ఇప్పటివరకు జరుగుతున్న భూ వివాదాల వాటన్నిటికీ కూడా పూర్తిగా చెక్ పెట్టొచ్చని మంత్రి నారాయణ తెలిపారు. కాబట్టి ఇప్పటిలా భూ తగాదాల విషయంలో నిత్యం రెవిన్యూ ఆఫీసులు మరియు కోర్టుల చుట్టూ తిరగాల్సిన బాధలు తప్పుతాయని కూటమి ప్రభుత్వం ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

భారత్ ఆర్మీ ఏ గెలిచింది… అసలు నిజం ఒప్పుకున్నా పాకిస్తాన్ ప్రధాని?

కేసీఆర్, హరీష్, ఈటలకు రిలీఫ్.. కాళేశ్వరం కమిషన్ సంచలన రిపోర్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button