సినిమా

“కన్నప్ప” సినిమాలో… ఎవరి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- మంచు విష్ణు తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అలాగే తన డ్రీం ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప సినిమా ఎట్టకేలకు అయితే విడుదల అయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా వసూలు కూడా రోజురోజుకీ మెల్లగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో దాదాపు ఏడు మంది స్టార్ హీరోలు నటించిన జరిగింది. అందులో ముఖ్యంగా ప్రభాస్, మంచు విష్ణు, మోహన్లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ మరియు కాజల్ నటించడం జరిగింది. ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ ఏడు మంది స్టార్ నటులకు ఒక్కొక్కరికి ఎంత రెమ్యూనికేషన్ ఇచ్చారనేది ఒక ? మిగిలిపోయింది. ఇక ఒక్కొక్క స్టార్ హీరోగా నటించిన వారికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మొదటగా ప్రభాస్ గురించి , అలాగే తనకి ఎంత రెమ్యూనిరేషన్ ఇచ్చారనేది ఎవరికీ తెలియదు. కానీ చాలా సందర్భాలలో మంచు విష్ణు మరియు మోహన్ బాబు ఇద్దరూ కూడా ప్రభాస్ ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని చెప్పుకొచ్చారు. బుజ్జిగాడు సినిమా సమయంలో మోహన్ బాబు మరియు ప్రభాస్ మధ్య ఏర్పడిన మంచి సంబంధం కారణంగా ఈ సినిమాను ప్రభాస్ ఫ్రీగా చేసినట్లు ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. ఇక ఆ తరువాత మోహన్లాల్ ఈ సినిమా కోసం ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని బయట టాక్ నడుస్తుంది. ఇక అదే విధంగా తమిళనాడు నుంచి వచ్చి కన్నప్ప సినిమాలో నాదనాధుడు అనే పాత్ర చేసినటువంటి శరత్ కుమార్ కూడా ఈ సినిమా కోసం ఒక రూపాయి కూడా తీసుకోలేదని తెలుస్తోంది. ఇక అక్షయ్ కుమార్ మాత్రం ప్రతిరోజు కూడా రెండు కోట్ల రూపాయలు చొప్పున ఐదు రోజులకు 10 కోట్లను ఛార్జ్ చేశాడట. ఇక కాజల్కు మాత్రం నామమాత్రపు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు చెప్తున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఎక్కువ కూడా బిఎఫ్ ఎక్స్ కు మరియు పోస్ట్ ప్రొడక్షన్స్ కు మాత్రమే ఖర్చు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో ఈ సినిమా వసూళ్లను రాబడుతుంది.

అడ్డగోలు వార్తలు రాసేవాళ్లను లోపలేయండి.. కోర్టు సంచలన తీర్పు

పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఓవైసీ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button