
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- అక్టోబర్ నెలలో విడుదలైన చాలా సినిమాలు ఈ నెలలో ఓటీటీ లోకి అందుబాటులోకి రానున్నాయి. బడా హీరోల సినిమాలు రిలీజ్ అవ్వకపోవడం వల్లనే గత అక్టోబర్ నెలలో యువ హీరోల సినిమాలు ఎన్నో రిలీజ్ అయ్యాయి. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈనెల 14, 15 మరియు 16వ తేదీలలో నాలుగు సూపర్ హిట్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇందులో భాగంగా.. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్యూడ్, సిద్దు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా, ద్రువ్ విక్రమ్ నటించిన బైసన్.. ఇక చివరిగా రష్మిక మరియు ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటించినటువంటి ‘థామ’ అనే సినిమా ఈ నెల 16వ తేదీన విడుదల కానుంది. ఈ నాలుగు సినిమాలు కూడా థియేటర్ల వద్ద కలెక్షన్లను రాబట్టాయి. థియేటర్లలో ఈ సినిమాలు చూడనీ ఫ్యాన్స్ కూడా ఓటీటీ లోకి ఎప్పుడు వస్తాయా అని ఇప్పటివరకు కూడా వేచి చూస్తూ ఉన్నారు. అయితే కేవలం మూడు రోజుల్లోనే నాలుగు సినిమాలు ఓటీటీ లోకి రావడంతో ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో మొదటిగా ఏ సినిమా చూడాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.
Read also : తప్పంతా ఆ ఎమ్మెల్యే దే.. TDP క్రమశిక్షణ కమిటీ కీలక వ్యాఖ్యలు?
Read also : ఒక్కో ఖండం నుంచి ఒక్కో జట్టు అయితే.. పాకిస్తాన్ కు కష్టమే!





