అంతర్జాతీయంక్రైమ్రాజకీయం

Imran khan: ఇమ్రాన్ ఖాన్ మరణించాడా..? పాక్‌లో గుప్పుమంటున్న వార్తలు..

Imran khan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలులో మరణించారన్న వార్తలు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ రూమర్లు మరింత వేగంగా వ్యాపిస్తుండటంతో ఆయన సోదరీమణులు పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యక్ష సమావేశం కోరారు.

Imran khan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలులో మరణించారన్న వార్తలు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ రూమర్లు మరింత వేగంగా వ్యాపిస్తుండటంతో ఆయన సోదరీమణులు పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యక్ష సమావేశం కోరారు. అయితే ఆ కోరికను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినందుకే పోలీసులు తమపై దారుణంగా వ్యవహరించారని నోరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ ఆరోపిస్తున్నారు. అడియాలా జైలు వెలుపల పార్టీ మద్దతుదారులతో కలిసి చేసిన నిరసనలో కూడా పోలీసులు తమను తోసిపుచ్చారని, దాడి చేశారని వారు వెల్లడించారు. ఇమ్రాన్ ఆరోగ్యం, భద్రతపై కుటుంబ సభ్యుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది.

2023లో అవినీతి ఆరోపణలపై శిక్ష అనుభవించడం ప్రారంభించినప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్‌ను కుటుంబ సభ్యులు మూడు వారాలుగా చూడటానికి అనుమతించకపోవడం వివాదాస్పదంగా మారింది. తమ నుంచి ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు జరగకపోయినా, పోలీసుల క్రూర వైఖరి తమను తీవ్రంగా కలిచివేసిందని సోదరీమణులు పేర్కొన్నారు. పంజాబ్ పోలీస్ చీఫ్ ఉస్మాన్ అన్వర్‌కు రాసిన లేఖలో 71 ఏళ్ల నోరీన్ నియాజీని కూడా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారన్న వాదన మరింత ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఇటువంటి ప్రవర్తన తాము శాంతియుతంగా విచారణ కోరిన సందర్భంలోనే జరిగిందని వారు పేర్కొన్నారు.

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వచ్చిన అసత్య వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పాక్ ప్రభుత్వం దేశంలో నెల రోజులపాటు సమావేశాలపై అప్రకటిత నిషేధం అమలు చేసింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా సీఎం సోహైల్ అఫ్రిదీ కూడా ఇమ్రాన్‌ను కలిసేందుకు చేసిన అభ్యర్థనలను జైలు అధికారులు ఏడు సార్లు తిరస్కరించడంతో పరిస్థితి మరింత అనుమానాస్పదంగా మారింది. రాజకీయ రంగంలో కీలక పాత్ర పోషించిన ఇమ్రాన్ ఖాన్ నిజంగా ఏ పరిస్థితిలో ఉన్నారన్న విషయంపై అధికారిక ప్రకటన లేకపోవడం పాక్ ప్రజల్లో గందరగోళాన్ని, తీవ్ర ఆందోళనను పెంచుతోంది.

ALSO READ: Smart phones: వామ్మొ.. లిస్ట్ పెద్దదే! డిసెంబర్‌లో రాబోతున్న కొత్త ఫోన్లు ఇవే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button