
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన పర్సనల్ మ్యాటర్స్ గురించి చెప్పుకొచ్చారు. సినిమాల్లో మునిగిపోయి పూర్తిగా పర్సనల్ లైఫ్ కోల్పోయానని హీరో విజయ్ తాజాగా తెలిపారు. తన గర్ల్ ఫ్రెండ్ తో పాటుగా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడప లేక పోయానని.. దానికి చాలా బాధగా ఉందని తను నటిస్తున్న కింగ్ డమ్ ప్రమోషన్ లో భాగంగా చెప్పుకొచ్చారు. గత రెండు మూడు సంవత్సరాల నుంచి సినిమా పరంగా చాలా బిజీగా గడిపానని చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే తల్లిదండ్రులకు, స్నేహితులకు అలాగే నా లైఫ్ పార్టనర్ కు టైం ఇవ్వలేకపోయానని అన్నారు. ఇది నన్ను నిత్యం కూడా బాధిస్తూనే ఉంటుంది అని చెప్పుకొచ్చారు.
కానీ ఒకరోజు ఈ విషయం గురించి ఆలోచించి చివరికి రియలైజ్ అయ్యాను అని అన్నారు. అందువల్లే ప్రస్తుతం తల్లిదండ్రులకు అలాగే స్నేహితులకు ప్రతి ఒక్కరికి కూడా సమయం కేటాయిస్తున్నానని ప్రమోషన్స్ లో భాగంగా చెప్పుకొచ్చారు. దీంతో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ పర్సనల్ మ్యాటర్స్ గురించి చాలామంది అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. సినిమాకు మీరిచ్చే వ్యాల్యూ అదని… కాబట్టి సినిమా కోసం కొన్ని త్యాగం చేయాల్సి వస్తుందని విజయ్ దేవరకొండ అభిమానులు విజయ్కు సపోర్ట్ చేస్తున్నారు. మరోవైపు జీవితంలో ఏది కూడా ఊరికే రాదు అని మరి కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు. అయితే తన గర్ల్ ఫ్రెండ్ ఎవరు అనేది విజయ్ దేవరకొండ మాత్రం చెప్పలేదు. <a href=”https://crimemirror.com/a-leopard-attacked-a-man-riding-a-bike-on-tirupati-zoo-park-road/”>తిరుపతి జూపార్క్ రోడ్ లో బైక్ పై వెళ్తున్న వ్యక్తిపై చిరుత దాడి!