
Heavy Rains in North India: రుతుపవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాదిలో బీభత్సం సృష్టిస్తున్నాయి. యూపీ, ఉత్తరాఖండ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్ లో ఎడతెరిపిలేని వానలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ప్రజా జీవనం స్తంభించింది. రహదారుల మీద కొండ చరియలు విరిగిపడుతున్నాయి. నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. రోడ్లు, విద్యుత్ వ్యవస్థలు ధ్వంసం అయ్యాయి. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు వెల్లడించారు.
వర్షాలకు తోడు భూకంపం
ఉత్తరప్రదేశ్ భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ప్రయాగ్ రాజ్, వారణాసిలో ఘాట్ లు వరద నీటిలో ముగినిపోయాయి. రెండు అడుగుల మేర నీటి మట్టం పెరిగితే గంగా హారతి ఇచ్చే ప్రాంతం పూర్తిగా మునిగిపోనుంది. అయోధ్యలో సరయూనది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. గంగా, సరియు నదులు ఉప్పొంగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఘాట్ ల దగ్గర రెస్క్యూ సిబ్బందిని ఏర్పాటు చేశారు. అటు అసోం, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలో నదులు ప్రమాదకర స్థాయి మించి ప్రవహిస్తున్నాయి. ఆయా రాష్ట్రాలో వరదలు ముంచేత్తున్నాయి. జమ్ముకశ్మీర్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తారాఖండ్ లో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. అటు ఉత్తరకాశి జిల్లాలో 3.2 తీవ్రతో భూకంపం రావడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. హిమాచల్ ప్రదేశ్ లో వరదల ధాటికి ఇప్పటి వరకు 78 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. పలువురు గల్లంతైనట్లు వెల్లడించారు.
గుజరాత్ లో హై అలర్ట్
అటు గుజరాత్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సాధారణ వర్షపాతం కంటే 46 శాతం ఎక్కువ నమోదయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులలో నీటిమట్టం పెరుగుతోంది. నదీ పరీవాహక ప్రాంత ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. పలు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు బెంగాల్ లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. దక్షిణ బంగాల్ కు చెందిన 5 జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, పిడుగులుతో వానలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించారు.
Read Also: జూలై 12 వరకు వానలు.. ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ!