
ఏపీలో విభిన్న వాతావరణం కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మూడు ఉమ్మడి జిల్లాలతో పాటు రాయలసీమకు చెందిన చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఒక వైపు ఎండలు కొడుతున్నా..మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.ఈ విరుద్ధ వాతావరణ పరిస్థితుల వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు ప్రజలు రహదారులపై ఇబ్బందులు పడుతున్నారు.
ఈదురు గాలులతో పాటు వచ్చిన వర్షాలకు పలు జిల్లాల్లో పంట నష్టం సంభవించింది. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో పంటలు దెబ్బతిన్నాయి. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం, ఎండు మిర్చి తడిసి ముద్దవుతున్నాయి. మామిడి తోటల్లో కాయలు నేలరాలిపోవడంతో రైతులు తీవ్ర నష్టాన్ని మూటగట్టుకున్నారు. మామిడి రైతులు ఇప్పటికే నాలుగు సార్లు ఈదురు గాలులకు బలై 60 శాతం కాయలను కోల్పోయారు.
భారత వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందన్న అంచనాతో రైతులకు ఊరటనిచ్చింది. ఏపీలో ఉత్తర కోస్తా జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, మిగిలిన జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశముంది. రాయలసీమ అంతటా అధిక వర్షాలు కురుస్తాయని వెల్లడించారు . ముఖ్యంగా కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి ..
-
తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.
-
మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని?
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?
-
ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..