
IMD: న్యూఢిల్లీలోని భారత వాతావరణ విభాగం మిషన్ మౌసమ్ పథకం కింద 134 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టులు ప్రాజెక్ట్ సైంటిస్ట్ (E, III, II, I), సైంటిఫిక్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ విభాగాల్లో ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 14, 2025 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ సైంటిస్ట్-E (1), ప్రాజెక్ట్ సైంటిస్ట్-III (13), ప్రాజెక్ట్ సైంటిస్ట్-II (29), ప్రాజెక్ట్ సైంటిస్ట్-I (64), సైంటిఫిక్ అసిస్టెంట్ (25), అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (2), మొత్తం 134 పోస్టులు. అర్హతలకు సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో MSc, BE/BTech పట్టభద్రులు కావాలి. పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. PhD/ME/MTech ఉన్నవారు అదనపు ప్రాధాన్యం పొందుతారు.
వయోపరిమితి: ప్రాజెక్ట్ సైంటిస్ట్-E 50 ఏళ్లు, III 45 ఏళ్లు, II 40 ఏళ్లు, I 35 ఏళ్లు, సైంటిఫిక్ అసిస్టెంట్/అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 30 ఏళ్లు మించకూడదు. జీతం నెలకు ప్రాజెక్ట్ సైంటిస్ట్-Eకు రూ.1,23,100, IIIకు రూ.78,000, IIకు రూ.67,000, Iకు రూ.56,000, సైంటిఫిక్/ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌కు రూ.29,200 ఉంటుంది. ఎంపిక స్క్రీనింగ్, విద్యార్హతలు, అనుభవం, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు ఆన్‌లైన్ ప్రారంభం 24.11.2025, చివరి 14.12.2025.
ALSO READ: Prime Minister of Japan: నేను రోజుకు 2 గంటలే నిద్రపోతా





