తెలంగాణ

హైదరాబాద్ లో కుండపోత, రహదారులు జలమయం

Hyderabad Rains: హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వానపడింది. ముఖ్యంగా బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, మెహిదీపట్నం, లంగర్‌ హౌస్‌, షేక్‌ పేట, కూకట్‌ పల్లి ప్రాంతాల్లో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రోడ్ల మీద సుమారు రెండు ఫీట్ల మేర నీళ్లు వచ్చి చేరాయి.  పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది.

లోతట్టు ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులు

హైదరాబాద్ లో అత్యధికంగా షేక్ పేటలో 19.3 మి.మీల వర్షపాతం నమోదైంది. బోరబండ, హైటెక్‌ సిటీ, ఖైరతాబాద్‌, మారేడ్‌ పల్లి, ఉప్పల్‌, షేక్‌ పేట, ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌ తో పాటు పలు ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రహదారులు జలమయంగా మారాయి. ప్రయాణీకులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు లోతట్టు ప్రాంతాల్లో వాన నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల నీరు నిలిచిపోవడంతో ఎమర్జెన్సీ టీమ్ లు వాటర్ ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. పోలీసులు రాత్రిపూట కూడా ట్రాఫిక్ కాకుండా విధులు నిర్వహించారు.

అధికారులకు అలెర్ట్ గా ఉండాలన్న సీఎం

ఇవాళ కూడా హైదరాబాద్ లో భారీ వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ గా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఇబ్బందులు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరికి ఎలాంటి ఆపద కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అన్నశాఖల అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని సీఎం సూచించారు.

Read Also: 5 జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ!

Back to top button