తెలంగాణ

నగరం నడివోడ్డున అక్రమ మార్బుల్స్ కంపెనీ షెడ్డుల నిర్మాణం..

క్రైమ్ మిర్రర్ రంగారెడ్డి :- హైదరాబాద్ నడిఓడ్డున గత ఐదు సంవత్సరాల నుండి ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుస్తుందని మార్బుల్స్ కంపెనీ పై పలు క్రిమినల్ కేసులు అయినప్పటికీ యదేచ్చగా కంపెనీ నడవడంపై రంగారెడ్డి జిల్లాలోని చర్చనీయంగా మారింది. అబ్దు ల్లాపూర్ మెట్టు మండలం కుంట్లూరు రెవెన్యూ సర్వేనెంబర్ 232,233,234,235 లో సుమారు పది ఎకరాల భూమి లో గత ఐదు సంవత్సరాల క్రితం ఓ మార్వాడి వ్యాపారి స్థానికంగా ఉన్న పట్టాదారుతో ఒప్పందం గురించుకొన్ని మార్బుల్స్ బండల కంపెనీ కి అగ్రిమెంట్ చేసుకున్నాడు. మున్సిపల్ అధికారులనుసంప్రదించకుండా ఇష్టానుసారంగా షెడ్డులను నిర్మాణం చేసి భారీ ఎత్తున మార్బుల్స్ కంపెనీ ని నడిపిస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పంది పెంటయ్య బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి మున్సిపల్ కమిషనర్ ని మార్బుల్స్ కంపెనీకి ఎటువంటి పర్మిషన్లు లేవని పలుమార్లు చెప్పిన చెవినా పెట్టడం లేదని ఆయన మున్సిపల్ కమిషనర్ పై ఆగ్రహ వ్యక్తం చేశారు.

కోర్టు కేసులు క్రిమినల్ కేసులు అయినప్పటికీ ఆ కంపెనీ ని ఎందుకు సీజ్ చేయడం లేదని ఆయన అన్నారు. భారీ వాహనాలతో మార్బుల్స్ టైల్స్ ని నిత్యం ఆ కంపెనీలోకి వందల సంఖ్యలో లారీలు తీసుక వస్తున్న ఆ కంపెనీపై మున్సిపల్ కమిషనర్ ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నాడని అయన అన్నారు. మున్సిపల్ కమిషనర్ ని పలుమార్లు ఆ కంపెనీపై వివరణ కోరగా ఆ కంపెనీకి ఎటువంటి పర్మిషన్ లేవని పలు కేసులు కంపెనీపై ఉన్నామని సమాధానం ఇచ్చాడు తప్ప చర్యలు మాత్రం తీసుకోవడం లేదన్నాడు. పర్మిషన్ లేకుండా చలామని ఐతున్న మార్బుల్స్ కంపెనీపై తక్షణమే చర్యలు తీసుకొక పోతే హైడ్రా కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేస్తామని హేచ్చరించారు.మరో కథనం లో ఆధారాలతో మీ ముందుకు…

వరకట్న దాహానికి మరో యువతి బలి.. కొడిమ్యాలలో బుగ్గారం అమ్మాయి దారుణ హత్య..?

హ్యాండ్ రైటింగ్ లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button