
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, మాడుగులపల్లి:- ఐకెపి కేంద్రం సిబ్బంది, రైతులు, హమాలీలు ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహిస్తే కొనుగోలు కేంద్రంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి(పిడి)వై. శేఖర్ రెడ్డి సూచించారు. బుధవారం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం పరిధిలోని పాములపహాడ్, చిరుమర్తి, ఆగామోత్కూర్, గుర్రప్పగూడెం గ్రామాలలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రైతులు పండించిన ధాన్యాన్ని అరబెట్టుకుని కొనుగోలు సెంటర్లకు తీసుకురావాలన్నారు. దళారీ వ్యవస్థను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. హమాలీలకు కింటాకు 45 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని 45 రూపాయలకు మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఎవ్వరు కూడా చెల్లించవద్దని అన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2320/-రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2300 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. సన్న రకం ధాన్యానికి కింటాకు 500 రూపాయలు చొప్పున బోనస్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఐకెపి కేంద్రం సిబ్బంది, రైతులు, హమాలీలు ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహిస్తే కొనుగోలు కేంద్రంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చని సూచించారు. అనంతరం ఆయా గ్రామాల ఐకెపి సిబ్బంది పిడి శేఖర్ రెడ్డి కి పూలబుకే ఇచ్చి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం చంద్రశేఖర్, సీసీలు సైదులు, నాగయ్య, ఆయా గ్రామాల ఐకెపి కేంద్రాల సిబ్బంది కునుకుంట్ల పావని, మణెమ్మ, సోనీ, సంధ్య, రేణుక, రాజకీయ నాయకులు తోట సత్తిరెడ్డి, కర్ర ఇంద్రారెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.