జాతీయం

మా ఉత్పత్తులను కొనకండి, ట్రంప్ పై జై శంకర్ ఘాటు వ్యాఖ్యలు!

S Jaishankar: రష్యా నుంచి చమురు కొనుగోళ్లను వ్యతిరేకిస్తూ భారత్‌ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలు విధించడంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తీవ్రంగా స్పందించారు. భారత ఆయిల్, రిఫైన్డ్ ఉత్పత్తుల విషయంలో ఏదైనా సమస్యలు ఉంటే  కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. వ్యాపార అజెండాతో సాగుతున్న అమెరికా యంత్రాంగానికి మద్దతిస్తున్న కొన్ని దేశాలు ఇతరులపై నిందలు వేసే ప్రయత్నాలు చేయడం ఫన్నీగా ఉందన్నారు.

వాణిజ్యేతర అంశాలకు టారిఫ్ లను ముడిపెట్టడం హాస్యాస్పదం

ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిలా విదేశాంగ విధానాన్ని ఇంత బహిరంగంగా నిర్వహించిన ఏ అధ్యక్షుడిని గతంలో చూడలేదన్నారు. వాణిజ్య అంశాలతో పాటు వాణిజ్యేతర వ్యవహారాలకు టారిఫ్‌లు వినియోగిస్తుండటం కొత్తగా ఉందని ఉన్నారు. ఒక్క భారత్‌ తోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలతో ఆయన డీల్ చేస్తున్న విధానం ఇలాగే ఉందన్నారు. వాణిజ్య సుంకాలను 50 శాతానికి పెంచుతున్నట్టు ట్రంప్ ప్రకటించడానికి ముందు రష్యా చమురు అంశం గురించి అమెరికాతో తాము ఎలాంటి చర్చలు జరపలేదదన్నారు. భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు.

దేశ ప్రయోజనాలకు నష్టం కలిగేలా వ్యవహరించం

మన దేశానికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని.. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత  మనపై ఉందన్నారు జైశంకర్. రైతులు, చిన్న ఉత్పత్తిదారుల ప్రయోజనాలు రక్షించుకోవడం ప్రధానం అన్నారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండబోతున్నారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నామంటూ టారిఫ్ లు విధిస్తున్న అమెరికా, అతిపెద్ద ఆయిల్ దిగుమతిదారు అయిన చైనాకు కానీ, యూరోపియన్ యూనియన్‌కు కానీ వర్తింపజేయక పోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. భారతదేశ అవసరాలు, గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకునే తాము మాస్కో నుంచి చమురును కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button