Homeఅంతర్జాతీయంచ‌ర్చ‌లు విఫ‌ల‌మైతే విధ్వంస‌మే...ఇరాన్‌కు ట్రంప్ స్ర్టాంగ్ వార్నింగ్‌...!

చ‌ర్చ‌లు విఫ‌ల‌మైతే విధ్వంస‌మే…ఇరాన్‌కు ట్రంప్ స్ర్టాంగ్ వార్నింగ్‌…!

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్‌: ఇరాన్‌, అమెరికాతో ఒప్పందం కోసం పాకిస్తాన్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేస్తున్న సంద‌ర్భంగా అధ్య‌క్షుడు ట్రంప్ ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చ‌ర్చ‌లు విఫ‌ల‌మైతే ఇక విధ్వంస‌మేన‌ని హెచ్చ‌రించారు. ఇరాన్ అంత‌ర్జాతీయ మార్గాల‌ను మూసివేయ‌డం త‌ప్ప ఇరాన్‌కు మ‌రో అస్ర్తం లేద‌న్నారు. ఇరాన్ అణ్వాయుధాలు త‌యారు చేయ‌కూడ‌ద‌ని అన్నారు.

ఇరాన్‌, అమెరికా రెండు వారాల‌ల విర‌మ‌ణ అనంత‌రం (శనివారం) పాకిస్థాన్‌లో రెండు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్ననర్‌లు ఇప్పటికే పాకిస్థాన్ చేరుకున్నారు. ఇరాన్ ప్రతినిధులు కూడా ఇస్లామాబాద్ వచ్చేశారు. మరికొన్ని గంటల్లో చర్చలు మొదలవ్వనున్నాయి. ఈ చర్చలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయన్న దానిపై యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

చర్చల ఫలితంతో సంబంధం లేకుండా.. హోర్ముజ్ జలసంధి దానంతట అదే తెరుచుకుంటుందని, త్వరలోనే హోర్ముజ్ జలసంధి తెరుచుకునేలా చేస్తామని అన్నారు. కాగా, ఇరాన్‌తో చర్చల నేపథ్యంలో ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ది ట్రూత్‌లో ఇరాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస పోస్టులు పెడుతున్నారు. శుక్రవారం పెట్టిన ఓ పోస్టులో.. ‘ఇరాన్ యుద్ధం చేసే దానికంటే.. ఫేక్ న్యూస్ మీడియాను, పబ్లిక్ రిలేషన్స్‌ను హ్యాండిల్ చేయటంలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తోంది’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు