
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ఎలక్షన్ల సమయంలో బురఖా వేసుకుని ఓటు వేయడానికి వచ్చిన వారిపై అధికారులకు అనుమానం కలిగితే ముఖం చూపించాల్సిందే అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఈమధ్య చాలా సందర్భాలలో ఆధార్ కార్డు కోసం కానీ, ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు వెళ్లిన కూడా కొంతమంది బురఖాని తీయట్లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇంకేదో ఇస్లామిక్ దేశం కాదు. ఇండియా. భారతదేశము ఒక సెక్యులర్ దేశం. ఎవరి పైన అయినా సరే సందేహం వచ్చింది అంటే కచ్చితంగా వారి ముఖాన్ని చూపించేలా చేస్తాము అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఇండియా కాబట్టి.. ఇక్కడ ఎన్నికల సంఘం రూల్స్ ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి అని తెలిపారు. కాబట్టి ఎలక్షన్ల సమయంలో అధికారులకు అనుమానం కలిగితే వారికి ముఖం చూపించే విధంగా సహకరించాలి అని కోరారు. ఆలా చేయకపోతే ఎన్నికల రూల్స్ ను అతిక్రమించినట్లేనని వెల్లడించారు. కాబట్టి వివిధ అత్యవసర పరిస్థితులలో బురఖా వేసుకున్నటువంటి మహిళలు తమ ముఖం చూపించాల్సి ఉంటుంది అని తెలిపారు. కాగా ఈ మధ్య ఎలక్షన్ల సమయంలో ఎన్నో ఓట్లు దొంగ ఓట్లుగా మారుతున్నాయని.. కాబట్టి అలా జరగకూడదని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఇలా వ్యాఖ్యానించారు.
Read also : ధాన్యం తడిసిన రైతులకు గుడ్ న్యూస్..!
Read also : మిర్జాగూడ బస్సు ప్రమాదం.. అదంతా అబద్ధం.. టిప్పర్ యజమాని సంచలన వ్యాఖ్యలు!





