
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా కుక్కల దాడులు చాలా ఎక్కువైపోయాయి. వీటి గురించి ప్రతి రోజు కూడా సోషల్ మీడియాలో వింటూనే ఉన్నాం. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క చోట కూడా కుక్కల బెడదతో ప్రశాంతంగా జీవించలేకపోతున్నామంటూ ఎంతోమంది ప్రజలు అధికారులకు విన్నపిస్తూ ఉన్న సందర్భాలను కూడా మనం వింటూనే ఉన్నాం. ఇప్పటికే ఎంతోమంది కుక్క కాటుకు గురై రేబిస్ లక్షణాలతో మరణించిన వారిని కూడా చూస్తున్నాం. అయితే ఈ కుక్క కాటు గురించి తాజాగా వైద్య నిపుణులు తెలిపిన విషయాలను తెలుసుకుంటే కచ్చితంగా ఆశ్చర్యపోతాం.
Read also : కేటీఆర్ పై సీఎం ఫైర్.. తిరిగి సెటైర్లతో ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్?
ఎందుకంటే.. ఎవరికైనా సరే ఒక కుక్క కరిచిన 14 రోజులు తర్వాతనే రేబిస్ లక్షణాలు అనేవి కనిపిస్తాయి. అయితే చాలామంది కుక్క కరిచిన వెంటనే వ్యాక్సిన్ లనేవి తీసుకుంటూ ఉంటారు. మరికొందరు ఏం కాదులే అని లైట్ తీసుకుంటారు. కానీ అలా చేయడం చాలా డేంజర్ అని వైద్యులు ఉంటున్నారు. ముఖ్యంగా మెదడుకు దగ్గరగా అంటే తల చుట్టూ ప్రాంతంలో… తల, ముఖం మెడ భాగాల్లో కుక్క కరిస్తే మాత్రం అది చాలా డేంజర్ అని.. దీనివల్ల రేబిస్ అనే వ్యాధి క్షణాల్లోనే మెదడును చేరుతుంది అని తెలిపారు. తల చుట్టుపక్కల ప్రాంతాలలో కుక్క కరిస్తే దాదాపు మరణం తద్యం అంటూ వైద్యునిపుణులే హెచ్చరిస్తున్నారు. ఇక మిగతా చోట కరిస్తే ఖచ్చితంగా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి అని.. అలా కాదు అని వాక్సిన్ వేయించుకోకుండా ఉంటే రేబిస్ లక్షణాలు సోకే అవకాశాలు ఉన్నాయని.. ఒక్కసారి లక్షణాలు కనిపిస్తే దాదాపు మరణం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Read also : సంక్రాంతి సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే?





