క్రైమ్

హైదరాబాద్ లో భారీగా మంటలు.. పరుగులు పెట్టిన జనాలు

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యూసఫ్‌గూడలోని హైదరాబాద్ బిర్యాని హౌస్ దగ్గర ఉన్న ఆటోమొబైల్ షాప్‌లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. దుకాణంలో మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.

ఈ ప్రమాదంలో అగ్నికి ఆటోమొబైల్ షాపులోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో షాపులో ఎవరూ లేకపోవటంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆటోమొబైన్‌ షాపులో షార్ట్​ సర్క్యూట్​ వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. దుకాణాలు మంటలు భారీ ఎత్తున వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో ప్రజలు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Back to top button