
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఐసీసీ మెన్స్ టి20 వరల్డ్ కప్-2026 లో భాగంగా తాజాగా పూర్తి వివరాలను అందించారు. ఈ టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇప్పటికే వేదికలు కూడా ఖరారు అయ్యాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, అహ్మదాబాద్, చెన్నై మైదానంలో మ్యాచులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పాకిస్తాన్ ఆడాల్సినటువంటి అన్ని మ్యాచ్లు కూడా శ్రీలంకలోని కొలంబోలు నిర్వహించటానికి కసరత్తులు జరుగుతున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ ను అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం లో నిర్వహించాలనే ఆలోచనలో కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఇక ప్రతి గ్రూపులోని టాప్ 2 జట్లు సూపర్ 8కు చేరతాయి. ఆ తరువాత రెండు గ్రూపులుగా విడిపోయి మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో టాప్ రెండు జట్లు సెమీస్ కు వెళ్తాయని సమాచారం. కాగా ఈసారి టి20 వరల్డ్ కప్ మాచెస్ అన్ని కూడా ఇండియా మరియు శ్రీలంక దేశాలలో జరుగునున్నాయి. దీంతో అన్ని జట్లు కూడా ఈ టి20 వరల్డ్ కప్ పై కన్ను వేశాయి.
Read also : సారా తాగితే సరసానికి పనికిరాడు.. వోడ్కా వాళ్ళ గవదులు వాచిపోతాయి!
Read also : మోదీని ఇంట్రెస్టింగ్ క్యూస్షన్ అడిగిన మహిళా ప్లేయర్?





