
క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్ ప్రతినిధి:-
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారు మరియు డిపిఆర్ఓ ఆదేశాల మేరకు మహాదేవపూర్ మండల్ మహాదేవపూర్ గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారథి సెగ్గం శిరీష కళాబృందం.. మత్తు పానీయాల నివారణ ,వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, భూ భారతి చట్టం పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెగ్గం శిరీష,జాడి సుమలత,కాస స్వాతి,పులి రాధిక,ఆత్మకూరి మహేందర్, కమ్మల ప్రవీణ్ కుమార్,గడ్డం నాగమణి,సొదారి సురేందర్,చిలుముల మధుబాబు పాల్గొన్నారు.