
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన నిర్మల్ సభలో భాగంగా రేవంత్ రెడ్డి పరోక్షంగా కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఓడిపోయిన వారి గురించి మాట్లాడదలుచుకోవడం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని అలాగే కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఒక ముఖ్యమంత్రి అధికారాన్ని ఇచ్చినటువంటి ప్రజలకు బాధ్యతతో పని చేయాలి అనుకుంటున్నాను అని అన్నారు. అలాగే ఈ ఎన్నికల తో పాటు రాబోయే ఎన్నికలలో కూడా మేమే గెలుస్తాము అని 2034 వరకు కూడా ప్రభుత్వాన్ని కొనసాగిస్తాము అని నిర్మల్ లో జరిగినటువంటి సభలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఓడిపోయిన వారి గురించి అలాగే ఇతర వ్యక్తుల గురించి మాట్లాడి ఒక ముఖ్యమంత్రిగా నేను టైం వేస్ట్ చేయదలుచుకోవడం లేదు అని… అనవసరంగా సమయాన్ని వృధా చేయను అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలందరికీ కూడా అన్ని విధాలుగా అండగా ఉంటాము అని మరోసారి స్పష్టం చేసారు. ఈ సభలో భాగంగానే చివరిగా తొమ్మదిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు ఇస్తాము అని రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.
Read also : ఈసారి సంక్రాంతి విన్నర్ ఈ సినిమానే..?
Read also : సంక్రాంతి వేల పందులు, పొట్టేళ్ల ఫైట్లు చూశారా?





