
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చిన తరువాత వస్తున్నటువంటి సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా థియేటర్లలో విడుదల కావడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూర్తిస్థాయిలో ప్రమోషన్స్ జరగకపోయినా రెండు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమా ప్రమోషన్ చేస్తూ కాలన్ని గడిపాడు. పూర్తిస్థాయిలో పవన్ కళ్యాణ్ తో పాటుగా జనసేన నాయకులు కూడా ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని కోరారు. అయితే ఈ హరిహర వీరమల్లు సినిమా సందర్భంలోనే పవన్ కళ్యాణ్ ఒక కీలక విషయాన్ని చెప్పుకొచ్చారు.
తెలంగాణకు రెడ్ అలర్ట్… మూడురోజుల పాటు వానలే వానలు
అయితే నేడు పవన్ కళ్యాణ్ తన భవిష్యత్తు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నేను పూర్తిస్థాయిలో రాజకీయాల్లో ఉండడం వల్ల.. ఇకపై సినిమాలు చేయబోనని క్లారిటీ ఇచ్చారు. కానీ నేను స్థాపించినటువంటి ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ పై చిత్రాలు నిర్మిస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న సినిమాలు అయిపోగానే వెంటనే నిర్మాతగా మారిపోతానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాతోనే నా జీవితం ముడిపడి ఉందని… కానీ ఇకపై నేను నటించకపోయినా ఈ సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగాను… మిగిలిపోతానని అన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ఎప్పుడూ ప్రారంభించకని అది పెద్దగా సక్సెస్ కాలేకపోయిందని చెప్పుకొచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ ఇకపై సినిమాల్లో నటించకపోవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే ఓజీ అనే రెండు సినిమాలు మిగిలి ఉన్నాయి. ఈ రెండు సినిమాలు మాత్రమే పవన్ కళ్యాణ్ అభిమానులకు పెద్ద పండుగ గా చెప్పుకోవచ్చు.
రోజా పై ఫైర్ అయిన జనసేన ఎమ్మెల్యే.. ఏపీ లో అగ్గిరాచుకుంటున్న రాజకీయాలు?