క్రైమ్తెలంగాణ

దేవుడు మీద ఒట్టు!.. నేనే తప్పు చేయలేదండి.. అంటూనే సూసైడ్?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి శ్రావ్య అనే వివాహిత భర్త అనుమానిస్తున్నాడని సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయేముందు మూడు నిమిషాల పాటు ఒక వీడియోని అప్లోడ్ చేసింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకున్న శ్రావ్య మాట్లాడిన మాటలు అన్నీ కూడా నిజమేనేమో అని అనిపిస్తుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రావ్య మరియు ధర్మ తేజ్ ఇద్దరు కూడా 2020 వ సంవత్సరంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. చాలా రోజుల తర్వాత ఒక కొడుకు కూడా పుట్టాడు. వీళ్ళిద్దరికీ కొడుకు పుట్టాక భర్త పనుల నిమిత్తం దుబాయ్ కి వెళ్ళాడు. అయితే ఈ సందర్భంలోనే భార్య మరొకరితో ఫోన్లో మాట్లాడుతుంది అని అనుమానంతో ప్రతిరోజు కూడా భర్త వేధిస్తూ ఉండేవాడు.

Read also : Ajit Doval: ట్రంప్ సుంకాల బెదిరింపులు..అజిత్ దోవల్ రష్యా టూర్!

అయితే భర్త చేస్తున్న అనుమానపు వ్యాఖ్యలను భరించలేక భార్య దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నా.. నేను ఎవరితోనూ మాట్లాడట్లేదు అని సూసైడ్ సెల్ఫీ తీసింది. ఈ సెల్ఫీ వీడియోలో.. చాలానే చెప్పుకొచ్చింది. నేను ఎవరితోనో ఫోన్ మాట్లాడట్లేదు, నేను చనిపోయాక అయినా నా ఫోన్ చూసి నిజం తెలుసుకో అని ఏడుస్తూ వీడియో తీసింది. నేను చనిపోయాక నా కొడుకుని బాగా చూసుకో… నువ్వు ఎలాంటి టెన్షన్ పడకు అని ఆ వివాహిత శ్రావ్య అనే మహిళ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉండగానే మధ్యలో ఏవో విషపూరిత మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆత్మహత్య చేసుకునే ఈ సెల్ఫీ వీడియో రాష్ట్రంలో హైలెట్గా మారిపోయింది. దీంతో భార్యాభర్తల మధ్య అనుమానాలు ఉంటే ఇలాంటి ఘోరమైన ఘటనలే చూడాల్సి వస్తుంది అని.. కాబట్టి దేనికైనా ఒక నమ్మకం అనేది ఉండాలి అని తోటి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read also : భారత్‌ను దూరం చేసుకోవద్దు.. నిక్కీ హేలీ కీలక వ్యాఖ్యలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button