
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి చోరీ కేసులో నిందితుడైనటువంటి రవికుమార్ నిజంగానే నేను తప్పు చేశాను అని అంగీకరించారు. తాజాగా పరకామణిలో నిజంగానే నేనే చోరీ చేశాను అని తన తప్పును అంగీకరిస్తూ నిందితుడు రవికుమార్ ఒక వీడియోని రిలీజ్ చేశారు. నేను చేసిన తప్పుకు ఇప్పటికే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నా. నిజంగా తప్పు చేశాను కాబట్టే ఆ తప్పుకు పరిహారంగా తన ఆస్తిలో 90% ఆ ఏడుకొండల వెంకన్నకు రాసిచ్చాను అని తెలిపారు. అయినా కూడా ఈ విషయంపై చాలామంది తప్పుగా ప్రచారం చేస్తున్నారు అని.. మరి కొంతమంది బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు అని నిందితుడు రవికుమార్ ఎమోషనల్ అవుతూనే చెప్పుకొచ్చారు. గత కొన్ని నెలలుగా మా కుటుంబం ఎన్నో వేధింపులకు గురవుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు కూడా ఈ విషయాన్ని తలుచుకొని నేను ఏడ్చిన రోజు లేదు అని నిందితుడు రవికుమార్ చేతులెత్తి దండం పెట్టారు. అయితే ఎవరి ఒత్తిడి వలన నేను ఇలాంటి పనులు చేయలేదు అని అతను స్పష్టం చేశారు. అయితే నిందితుడు రవికుమార్ స్పందించిన తీరు పట్ల చాలామంది బాధను వ్యక్తం చేస్తున్న కూడా మరి కొంతమంది మాత్రం దేవుడు జోలికి వస్తే ఇంతే జరుగుతుంది అని కామెంట్లు చేస్తున్నారు.
Read also : వైజాగ్ లో 20వేల పరుగులను పూర్తిచేసుకుని మైలురాయిని సాధించిన రోహిత్ శర్మ!
Read also : నీ అబద్ధాల ప్రచారంతో వాస్తవాలు కనుమరుగు కావు : హరీష్ రావు





