
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన “రాజా సాబ్” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ హైదరాబాదులో చాలా ఘనంగా జరిగింది. ఇందులో భాగంగానే ఈవెంట్ కు ప్రభాస్ తో పాటుగా సినిమాలోని హీరోయిన్స్ అలాగే నటులు పాల్గొన్నారు. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చూడడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రభాస్ అభిమానులు భారీగా తరలివచ్చారు. అయితే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో భాగంగా కొంతమంది యువతులు ప్రభాస్ ను పెళ్లి చేసుకోవాలి అంటే మాకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ విషయాన్ని సుమ స్వయంగా మైక్ లో అందరికీ తెలిసే విధంగా ప్రభాస్ దగ్గరికి వెళ్లి ప్లకార్డులో ఉన్నది ఉన్నట్లుగా అడిగేశారు.
Read also : జర్నలిస్టుల హక్కులను హరించే కొత్త జీవోను సవరించాలి
దీంతో ప్రభాస్ ఇక సమాధానం చెప్పలేక.. చివరికి ఆ క్వాలిటీస్ ఏంటో నాకు తెలియకనే ఇప్పటివరకు ఇంకా పెళ్లి చేసుకోలేదు అని సరదాగా నవ్వుతూనే జవాబు చెప్పేశారు. దీంతో ప్రభాస్ చాలా ఫన్నీగా సమాధానం చెప్పడంతో అక్కడున్నటువంటి అభిమానులు అందరూ కూడా కేకలతో హోరెత్తించారు. ఇక ఈ సినిమా జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే మరోవైపు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో భాగంగా ప్రభాస్ స్పిరిట్ లుక్ లో కనిపించారు అంటూ చాలా మంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఎక్కువ గడ్డం అలాగే పిలక జుట్టుతో కనిపించేసరికి ఈ లుక్ స్పిరిట్ లోనిదే అని ప్రభాస్ అభిమానులు అనుకుంటున్నారు. ఏది ఏమైనా కూడా చాలా రోజుల తర్వాత ప్రభాస్ మరో హిట్ కొట్టేస్తారు అని అభిమానులు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.
Read also : కెరీర్ ఒత్తిళ్ల ప్రభావం.. యువతలో దెబ్బతింటున్న మానవ సంబంధాలు!





