
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :-టాలీవుడ్ లో ప్రస్తుతం యువ హీరోయిన్ మీనాక్షి చౌదరి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తను నటిస్తున్నటువంటి అన్ని సినిమాలు కూడా ఈ మధ్య వరుసగా హిట్లవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తనపై కొన్ని రూమర్స్ అనేవి వస్తున్నాయి. దీనిపై తాజాగా మీనాక్షి చౌదరి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నా గురించి ఏమైనా చెప్పాలి అంటే వెంటనే సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తాను అని.. కాబట్టి ఎవరు కూడా రూమర్స్ సృష్టించాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. ఇక లక్కీ భాస్కర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఆ సినిమాలో క్యారెక్టర్ నచ్చే తల్లి పాత్రలో చేశాను అని… ఇకపై తల్లి క్యారెక్టర్లు వస్తే మాత్రం కచ్చితంగా నిర్మొహమాటంగా చేయను అని వారి ముఖం మీదే చెప్తాను అని చెప్పుకొచ్చారు. ఇక ఈ హీరోయిన్ తాజాగా చిరంజీవి చేస్తున్నటువంటి ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా నా కెరీర్ లోనే స్పెషల్ చాప్టర్ గా నిలిచిపోతుంది అంటూ నటి మీనాక్షి చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సీనియర్ హీరోలతో కూడా నటించడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని మీనాక్షి చౌదరి తెలిపారు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చేటువంటి రూమర్స్ ను నేను పట్టించుకోను… కాకపోతే ఎవరూ కూడా ఇలాంటివి స్ప్రెడ్ చేయకుండా ఉంటే చాలు అంటూ పేర్కొన్నారు. ఏది ఏమైనా సరే భవిష్యత్తులో తల్లి పాత్రలైతే అసలు చేయబోనని క్లారిటీ ఇచ్చారు.
Read also : సనాతన ధర్మ పరిరక్షణకు బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమయింది : డిప్యూటీ సీఎం పవన్
Read also : వేములపల్లి లో దారుణం… కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి





