
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాబోతున్నటువంటి మొట్టమొదటి సినిమా హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించినటువంటి ఈ సినిమా దాదాపు చాలా రోజుల తర్వాత థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు పోస్ట్ పోన్ అవుతూ.. పవన్ కళ్యాణ్ రీ షెడ్యూల్లో సినిమాని పూర్తిచేసుకుని రేపు విడుదలకు సిద్ధం అయ్యింది. రేపు గురువారం పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా చాలా ఘనంగా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా విడుదల అవ్వకముందే పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే పలు కీలక నాయకులు కూడా పవన్ కళ్యాణ్ సినిమా ఘనవిజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను.
బొగత జలపాతాలకు భారీగా వరద ఉధృతి.. పర్యాటకులకు అనుమతి నిరాకరణ!
ఇక తాజాగా మంత్రి నారా లోకేష్ ‘ మా అన్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా చాలా అద్భుతమైన విజయం సాధించాలని’ కోరుకుంటున్నట్లుగా తెలిపారు. మా పవన్ అన్న సినిమా విడుదల సందర్భంగా చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్నటువంటి చిత్ర బృందానికి కూడా ప్రత్యేక అభినందనలు అని చెప్పుకొచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి అభిమానులు లాగానే నేను కూడా మా పవనన్న సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని కోరుకుంటు.. చాలా ఆసక్తిగా వేచి చూస్తున్నానని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అన్న, పవన్ కళ్యాణ్ సినిమాలన్నా, ఆయన స్టైల్ నాకు చాలా బాగా ఇష్టమని సోషల్ మీడియా వేదిక ద్వారా నారా లోకేష్ ట్వీట్ చేశారు. కాగా మరోవైపు రాజకీయపరంగాను చాలా మంది జనసేన ఎమ్మెల్యేలు దేవాలయాలకు వెళ్లి మరి ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించాలని మొక్కుకున్న సందర్భాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి.