
-
కేటీఆర్‌కు డక్కాముక్కీలు తెలియదు
-
తండ్రి సీటిస్తే డైరెక్ట్ ఎమ్మెల్యే అయ్యారు
-
రివేంజ్ తీసుకునే అలవాటు నాకు లేదు
-
నేనలా అనుకుంటే హరీశ్ హైదరాబాద్‌లో తిరగలేరు
క్రైమ్‌మిర్రర్, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం మీద, సీఎం రేవంత్ రెడ్డి మీద బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్‌కు ఢిల్లీ పుట్టినిల్లన్నారు. సీఎం తన బాధ్యతగా ఢిల్లీ వెళ్లి తన కర్తవ్యాలను నెరవేర్చుతున్నారని తెలిపారు.
గాంధీ భవవన్‌లో జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ది అనుభవంతో కూడిన రాజకీయమన్నారు. కేటీఆర్‌కు డక్కాముక్కీలు తెలియవని, ఆయన కనీసం సర్పంచ్‌గా, జెడ్పీటీసీగా గెలవలేదని అన్నారు. తండ్రి కేసీఆర్ సీటిస్తే డైరెక్టుగా కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారని ఎద్దేవా చేశారు. తమ అనుభవం ముందు కేటీఆర్ జీరో అన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ సర్కార్‌పై ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ నేతలు తిడుతున్నందుకే… తాము రియాక్ట్ కావాల్సి వస్తోందన్నారు.
కేసీఆర్ కుటుంబం లిక్కర్ దందా చేసేందుకు ఢిల్లీ వెళ్లిందని… తన కూతురు జైలుకు కూడా వెళ్లిందని అన్నారు. హరీశ్‌రావుపై రివేంజ్ తీసుకునే ఉద్దేశం తనకు లేదన్నారు. అలాంటి అలవాటు తనకు లేదన్నారు. ఒకవేళ రివేంజ్ తీసుకోవాలనుకుంటే…. హరీశ్‌రావు హైదరాబాద్‌లో తిరగలేరని హెచ్చరించారు జగ్గారెడ్డి.