క్రైమ్తెలంగాణవైరల్
Trending

I BOMMA నిర్వాహకుడు అరెస్ట్.. మూడు కోట్లు స్వాధీనం!

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- ప్రముఖ సోషల్ మీడియా వెబ్సైట్ ibomma కు హైదరాబాద్ కూకట్పల్లి పోలీసులు షాక్ ఇచ్చారు. Ibomma నిర్వకుడైనటువంటి ఇమ్మడి రవిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ ibomma ఫ్లాట్ ఫామ్ లో ఎన్నో సినిమాలను విడుదలైన రోజునే ఇందులో విడుదల చేయడంతో చాలా సినిమాల కలెక్షన్ల పై ప్రభావం చూపింది. ఎంతోమంది సినిమా ప్రేక్షకులు థియేటర్కు వెళ్లకుండా నేరుగా ఈ వెబ్సైట్లోనే చూడడంతో ఈ విషయం చాలా రోజుల నుంచి సంచలనం సృష్టిస్తుంది.ఈ ibomma నిర్వాహకుడు రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఈ ibomma ను నిర్వహిస్తూ చాలా డబ్బును సంపాదించారు అని పోలీసులు గుర్తించారు. ఇతడి ఎకౌంట్లో నుంచి దాదాపు మూడు కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశారు. ఫ్రాన్స్ నుంచి వచ్చిన రవిని హైదరాబాద్ కూకట్పల్లిలోని సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఏ సినిమా అయినా సరే విడుదలైన మొదటి రోజునే పైరసీ చేసి తమ వెబ్సైట్లో పెట్టడం పై నిర్మాతలు ఎన్నోరకాలుగా ఐబొమ్మపై కంప్లైంట్లు చేశారు. ఎట్టకేలకు పోలీసులు ఇతనిని పట్టుకోవడంతో ఇకనైనా ఇలా సినిమాలు ప్రైవసీకి గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి అధికారికి ఉంది అని.. కాబట్టి ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఈ ప్రైవసీ అనే భూతాన్ని పోలీసు అధికారులు మట్టిలో కలిపేయాలని చాలామంది సినిమా ఇండస్ట్రీలోని నటులు మరియు డైరెక్టర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read also : కాంగ్రెస్ కు జై కొట్టిన టీడీపీ… అందుకే నవీన్ ఘన విజయం!

Read also : మరో అల్పపీడనం.. నాలుగు రోజులపాటు భారీ వర్షాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button