
దేశవ్యాప్తంగా సంచలనం స్పష్టించిన హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో జరిగిన అత్యాచారయత్నం ఘటనలో కీలక పురోగతి సాధించారు పోలీసులు. కదులుతున్న ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతి పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. మేడ్చెల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్ గా ఈ ఘటనకు పాల్పడినట్లుగా తేల్చారు. జంగం మహేశ్ ఫోటోను బాధితురాలికి చూపించారు పోలీసులు. కదులుతున్న ఎంఎంటీఎస్ రైలులో తన పై లైంగిక దాడికి యత్నించింది మహేశేనని ఫోటో ఆధారంగా గుర్తించింది బాధిత యువతి.
ఏడాది క్రితమే మహేశ్ ను వదిలేసింది అతని భార్య. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్న మహేశ్.. కొంత కాలంగా గంజాయికి బానిసైయ్యాడని తెలుస్తోంది. నేరాలకు పాల్పడుతూ పలుసార్లు పోలీసులకు చిక్కి జైలుకు కూడా వెళ్లాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో మహేశ్ ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి ..
-
సర్పంచ్ పదవి కోసం తండ్రిని చంపించిన కూతురు.. సూర్యాపేట జిల్లాలో దారుణం
-
ప్రేమించిన యువతి మృతి చెండడంతో- మనస్థాపంతో యువకుడి ఆత్మహత్యయత్నం
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. ప్రభాకర్ రావు సంచలనం
-
ఐదుగురు నన్ను లైంగికంగా వేధించారు- కన్నీరుపెట్టుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్
-
బంధన్ బ్యాంకులో బడా మోసం – 6 లక్షల పొదుపు సంఘాల డబ్బుతో మేనేజర్.
కదులుతున్న ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతి పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు.