Homeక్రైమ్రెండో పెళ్లి చేసుకోవాలని 9 నెలల గర్భిణిని చంపిన భర్త

రెండో పెళ్లి చేసుకోవాలని 9 నెలల గర్భిణిని చంపిన భర్త

నిజామాబాద్ జిల్లాలోని ఇందల్‌వాయి మండలం గన్నారం గ్రామంలో ఈ నెల 22న అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. గన్నారం గ్రామానికి చెందిన నాగేష్‌కు కామారెడ్డి పట్టణంలోని తిమ్మక్‌పల్లికి చెందిన సుమలత (32)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇప్పటికే ముగ్గురు కుమారులు ఉండగా, సుమలత ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణిగా ఉంది.

పోలీసుల వివరాల ప్రకారం.. మద్యానికి బానిసైన నాగేష్ భార్యను తరచూ శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. రెండో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో భార్యను హత్య చేయాలని పన్నాగం పన్నినట్లు విచారణలో బయటపడింది. ఈ నెల 22 అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో భార్య గొంతునులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరుసటి రోజు ఉదయం సుమలత నిద్రలోనే మృతిచెందినట్లు బంధువులకు చెప్పి సహజ మరణంగా చూపించేందుకు ప్రయత్నించాడు. అయితే అల్లుడి ప్రవర్తనపై అనుమానం కలిగిన మృతురాలి తల్లి బాలరాజవ్వ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నాగేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వినోద్, ఎస్సై సందీప్ తెలిపారు.

ALSO READ: తరచూ యూరిన్ వెళ్తున్నారా?

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు