
Nagarjuna Sagar: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలో కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. శ్రీశైల ప్రాజెక్టు నుంచి 93,127 క్యూసెక్కుల వరద సాగర్ డ్యామ్ లోకి వచ్చి చేరుతుతున్నది. దాదాపు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు రెడీ అవుతున్నారు. ఇవాళ రెండు గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తోంది.
పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో..
నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 290 అడుగులు ఉండగా, ప్రస్తుతం 853.8 అడుగులకు చేరింది. ప్రాజెక్టు గరిష్టం సామరథ్యం 312.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 293.97 టీఎంసీలకు చేరింది. మరో 18 టీఎంసీల నీరు వస్తే నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యాన్ని అందుకుంటుంది.
శ్రీశైలంలోకి కొనసాగుతున్న వరద
అటు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు కొనసాగుతోంది. ప్రస్తుతం రెండు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాంలోకి జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1.27 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో అధికారులు 1.40 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.4 అడుగులకు చేరింది. అటు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 201.12 టీఎంసీలుగా ఉంది.
Read Also: సృష్టితో డా.నమ్రత ఘోరాతి ఘోరాలు