Monday, February 23, 2026
Homeక్రైమ్పెళ్లి ముసుగులో భారీ మోసాలు.. సజ్జనార్ కీలక సూచనలు?

పెళ్లి ముసుగులో భారీ మోసాలు.. సజ్జనార్ కీలక సూచనలు?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లి ముసుగులో చాలా మోసాలు జరుగుతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. నిత్యం ప్రతిరోజు కూడా పోలీస్ స్టేషన్ లో ఈ విషయాలపై చాలానే కేసులు కూడా నమోదు అవుతున్నాయి. అయితే ఈ విషయంపై తాజాగా హైదరాబాద్ CP సజ్జనార్ కొన్ని కీలక సూచనలు చేశారు. ఈ మధ్యకాలంలో హైదరాబాదులో పెళ్లి పేరుతో పెరిగిపోతున్నటువంటి మోసాలు ప్రతి ఒక్కరిని కూడా ఆందోళన కలిగిస్తున్నాయి అని అన్నారు. పెళ్లిచూపుల పేరిట నిశ్చితార్థం అయిన తర్వాత శారీరకంగా అంతా అనుభవించేసి ఆ తర్వాత భారీగా కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటాను అనడం వంటి సందర్భాలు పోలీస్ స్టేషన్ వరకు వస్తున్నాయి అని తెలిపారు. కేవలం ప్రేమ పేరుతోనే కాకుండా పెద్దలు కుదిర్చినటువంటి అరేంజ్డ్ మ్యారేజ్ వంటి సంబంధాల మాటున కూడా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి అని చెప్పారు. ఇటువంటి మోసాలు పై యువత కాస్త అప్రమత్తంగా ఉండాలి అని.. ఇవి మీకే ఎదురైతే వెంటనే షీ టీమ్స్ వాట్సప్ ( 949061655) లేదా డయల్ 100 కి ఫిర్యాదు చేయవచ్చు అని సూచించారు.

ఉగాదిలోపే వారికి ఇందిరమ్మ ఇళ్లు!

ఉగాదిలోపే వారికి ఇందిరమ్మ ఇళ్లు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments