
-
నీళ్లు విడుదల చేసిన ఏపీ సీఎం చంద్రబాబు
-
మల్యాల పంప్ హౌస్ దగ్గర మోటార్లు ఆన్
క్రైమ్ మిర్రర్, అమరావతి: రాయలసీమ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను సీమకు తరలించే ప్రక్రియ మొదలైంది. గురువారం ఏపీ సీఎం చంద్రబాబు హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్-1 కాలువలకు నీటిని విడుదల చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంప్ హౌస్ వద్ద రెండు మోటార్లను స్టార్ట్ చేశారు చంద్రబాబు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా జలాలను రాయలసీమకు తరలించనున్నారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఇవాళ తనకెంతో సంతోషంగా ఉందన్నారు. రాయలసీమకు నీళ్లిచ్చి, ఇక్కడి రైతన్నలకు చేదోడుగ ఉండటం ఎప్పటికీ ప్రత్యేకమేనన్నారు చంద్రబాబు. రాయలసీమ జీవనాడి అయిన హంద్రీనీవా ప్రధాన కాలువల విస్తరణ పనులు వేగవంతం చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3850 క్యూసెక్కుల పెంచుతున్నామన్నారు. దీనివల్ల రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారాయన. త్వరలోనే ఫేజ్-2 పనులు చేపట్టి పూర్తిచేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాయలసీమ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు అన్నారు.
Read Also: ఏపీలో మరో దారుణం… భార్య, పిల్లలను చంపిన కిరాతకుడు