ఖమ్మం, క్రైమ్ మిర్రర్: దివ్యాంగురాలనని ఆమె కుమిలి పోలేదు. పట్టుదలతో చదివి ఆమె లాంటి వారికి ఆదర్శంగా నిలువాలనుకుంది. దానికి తగ్గట్టుగానే ఇంటి పట్టునే ఉన్నప్పటికీ కష్టపడి చదివింది. పది పరీక్షల్లో సత్తా చాటాలని కళలు కనింది. కాని ఆమెకు పరీక్ష రాసే ప్లేస్ భవనం రెండో అంతస్తులో కేటాయించడంతో తీవ్ర మానిసిక ఇబ్బంది ఎదుర్కొంటుంది.
దీంతో పరీక్ష రాయడం ఆమెతో పాటు అమ్మకు కూడ పరీక్షే అవుతుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశ్వాపురం గ్రామానికి చెందిన కొండూరి జానయ్య-శారద దంపతులకు కుమార్తె రేణుకతోపాటు ఇద్దరు కుమారులు. భార్యాభర్తలు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే చిన్నతనం నుంచే ఎదుగుదల లేని స్థితిలో ఉన్న రేణుకకు చదువంటే చాలా మక్కువ.
ఆమె పట్టుదలతో చదివి పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్దమైంది.ఈ తరుణంలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కావడంతో నడవలేని తన కూతురును ఎత్తుకొని తల్లి కూసుమంచి మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చింది. ఆమెకు రెండో అంతస్తులో గది కేటాయించడంతో తన బిడ్డను చంటి పిల్లలా ఎత్తుకొని ఇబ్బందులు పడుతూ సీట్లో కూర్చోబెట్టింది.
పరీక్ష ముగిసిన తర్వాత తల్లి మళ్లీ కూతురు రేణుకను ఎత్తుకొని ఇంటికి తీసుకొని పోవడం బిడ్డకు చదువు పట్ల ఉన్న ఇష్టం, బిడ్డ ఎదుగుదలకు తల్లిపడుతున్న కష్టాన్ని చూసిన ప్రతి ఒక్కరిని ఆలోసింప చేస్తుంది. కాగా దివ్యాంగురాలైన రేణుకకు పరీక్ష కేంద్రాన్ని కేంద్రాన్నికిందకు మార్చితే బాగుంటుందని ఆమె తల్లి కోరుతుంది. తన కూతురు బాగ చదువుతుంది కాని ఈ పరిస్థితుల్లో ఎంత దూరం ఎత్తుకొని వెళ్లాలని ఆమె పరీక్ష కేంద్రం ముందు ఆవేదన వ్యక్తచేసింది.
