
మార్చి తొలివారంలో భానుడు భగభగమండుతున్నడు. రికార్డ్ స్థాయిలో టెంపరేచర్స్ నమోదమవుతున్నాయి. తెలంగాణలో రాబోయే మూడు రోజులలో గరిష్టంగా ఉష్ణోగ్రతలో క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు పెరగనుంది. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజులలో గరిష్టంగా ఉష్ణోగ్రతలో 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుదల ఉంటుందని తెలపింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 35డిగ్రీల నుంచి 21 డిగ్రీల వరకు ఉంటాయని అంచనా వేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం అత్యధికంగా భద్రాచలంలో –38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తెలుగు రాష్ట్రాలకు మాడుపగిలే సమాచారం ఇచ్చింది భారత వాతావరణశాఖ. ఈ వేసవి సీజన్‌లో తెలుగు రాష్ట్రాల పాటు దేశంలో అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారుతాయని హెచ్చరించింది. గత కొన్నేళ్లుగా వేసవిలో ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత మరింత పెరగనుందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో ఫిబ్రవరిలోనే ఎండ మండిపోయాయి. పలుచోట్ల వడగాలులు కొనసాగాయి. ఈ మూడు నెలలు అంటే… మార్చి నుంచి మే వరకూ ఎండ తీవ్రత క్రమేపీ పెరుగుతుందని వాతావరణశాఖ అంచనావేసింది.