
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తాజాగా హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమవడంతో కారులోనే ఉన్నటువంటి డ్రైవర్ సజీవ దహనం అవడంతో పాటు పూర్తిగా కాలిన తర్వాత అతని అస్తిపంజరం మాత్రమే బయటకు కనిపిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వీటిని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇక అసలు వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ శామీర్ పేట ORR మీద ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రన్నింగ్ లో ఉన్న కారు లో మంటలు చెలరేగడంతో కొద్ది నిమిషాల్లోనే పూర్తిగా కారు దగ్ధమైంది. ఇక డ్రైవర్ సీట్ లో అంతే కూర్చున్న డ్రైవర్ సజీవ దహనం అవడంతో అతని అస్తిపంజరం మాత్రం బయటకు కనిపిస్తుండడంతో ఆ ఫోటోలను తీసిన కొంతమంది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో బిత్తర పోయారు. అస్తిపంజరం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా భయంతో కూడిన ఒక సినిమా దృశ్యం లా కనిపిస్తుంది. ఇక వెంటనే ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలపడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ సీట్ బెల్ట్ లాక్ అవడంతోనే అతను బయటకు రాలేకపోయాడని స్పష్టంగా అర్థం అవుతుంది.
Read also : టికెట్లు అయిపోయే.. ప్రైవేట్ బస్సులకు పండుగే!
Read also : రైతుల ఒంటి మీద చొక్కా తీసి రోడ్డు మీద నిలబెట్టారు : జగన్





