క్రైమ్తెలంగాణ

Honeytrap: భార్య మరో పురుషుడితో న్యూడ్‌గా ఉండగా వీడియోలు తీసిన భర్త

Honeytrap: ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకుని అర్ధనగ్న ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తూ యువకులను ఆకర్షించి వలలో పడేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న ఓ దంపతుల గుట్టు కరీంనగర్‌లో బయటపడింది.

Honeytrap: ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకుని అర్ధనగ్న ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తూ యువకులను ఆకర్షించి వలలో పడేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న ఓ దంపతుల గుట్టు కరీంనగర్‌లో బయటపడింది. మహిళ వల విసిరితే, ఆమె భర్త అదే అవకాశాన్ని ఆయుధంగా మార్చుకుని గుట్టుగా వీడియోలు తీసి బాధితులను బెదిరిస్తూ భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ దంపతులు పదేళ్లుగా కరీంనగర్‌లోని ఆరెపల్లిలో నివాసం ఉంటున్నారు. భర్త గ్రానైట్ మరియు ఇంటీరియర్ డిజైన్ వ్యాపారం చేస్తుండగా, భార్య యూట్యూబ్ చానల్ నిర్వహిస్తోంది. అయితే వ్యాపారంలో నష్టం రావడంతో సులువుగా డబ్బు సంపాదించేందుకు వీరు నేర మార్గాన్ని ఎంచుకున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళ అర్ధనగ్న ఫొటోలు పోస్టు చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంది. ఆమె ఖాతాకు 1000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఫొటోలను చూసి ఆకర్షితులై ఆమెను సంప్రదించిన వారిని ఇంటికి రప్పించి, ముందుగా డబ్బు తీసుకుని ఏకాంతంగా గడిపేది. ఆ సమయంలో భర్త గుట్టుగా వీడియోలు తీసేవాడు.

ఆ వీడియోలను ఆధారంగా చేసుకుని బాధితులను బ్లాక్‌మెయిల్ చేయడం ఈ దంపతుల ప్రధాన దందాగా మారింది. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించడంతో భయపడిన చాలా మంది వారికి భారీ మొత్తంలో డబ్బులు సమర్పించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ విధంగా వ్యాపారులు, వైద్యులు, వైద్య విద్యార్థులు, యువకులు సహా పలువురు వారి వలలో చిక్కినట్లు పోలీసులు తెలిపారు.

ఈ అక్రమ ఆదాయంతో దంపతులు దాదాపు రూ.65 లక్షలతో ఒక ప్లాట్ కొనుగోలు చేశారు. అంతేకాక ఖరీదైన ఫర్నిచర్, రూ.10 లక్షల విలువైన కారు కూడా కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మహిళ తన ఫాలోవర్లలో వంద మందికిపైగా వ్యక్తులతో సంబంధం కొనసాగించినట్లు సమాచారం.

ఈ వ్యవహారం బయటపడేందుకు కారణమైనది కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు. ఏడాది క్రితం దంపతులకు పరిచయమైన అతడు వారితో సన్నిహితంగా ఉండేవాడు. ఈ క్రమంలో వివిధ రూపాల్లో అతడి నుంచి దంపతులు దాదాపు రూ.14 లక్షలు వసూలు చేశారు. డబ్బులు ఇక ఇవ్వలేని పరిస్థితి రావడంతో ఆ వ్యక్తి వారిని దూరంగా పెట్టాడు.

దీంతో దంపతులు అతడిని ఫోన్ చేసి మరో రూ.5 లక్షలు ఇవ్వకపోతే నగ్న వీడియోలను బహిర్గతం చేస్తామని, ప్రాణహానీ చేస్తామని బెదిరించారు. భయంతో మంగళవారం శ్రీపురం కాలనీ వద్ద వారికి ఒక లక్ష రూపాయలు ఇచ్చిన బాధితుడు.. మిగిలిన డబ్బులు ఇవ్వలేనని చెప్పాడు. అయినా బెదిరింపులు ఆగకపోవడంతో బంధువులు, మిత్రుల సూచన మేరకు పోలీసులను ఆశ్రయించాడు.

ఫిర్యాదు, సమర్పించిన ఆధారాల ఆధారంగా కేసు నమోదు చేసిన కరీంనగర్ రూరల్ పోలీసులు బుధవారం నిందితులైన దంపతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి కారు, నగ్న వీడియోలు ఉన్న మొబైల్ ఫోన్లు, నగదు, బాధితుడికి చెందిన చెక్కును స్వాధీనం చేసుకున్నారు.

ALSO READ: WOW: అక్కడ సంక్రాంతి 9 రోజుల పండగ.. ఎక్కడో తెలుసా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button