
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే రెండు నెలల నుంచి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. మళ్లీ నేడు కూడా ఏపీ వ్యాప్తంగా భయంకరమైన భారీ వర్షాలు కురుస్తాయని IMD పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, పిడుగుల సూచనల కారణంగా చెట్ల కింద ఎవరూ కూడా నిలబడుద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం లోని అన్ని జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు చాలా రకాలుగా పదిమంది నష్టపోయారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ భారీ వర్షాల కారణంగా భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఏపీలో వర్షాలు పడే జిల్లాలు
1. ఎన్టీఆర్
2. గుంటూరు
3. బాపట్ల
4. పల్నాడు
5. ప్రకాశం
6. నెల్లూరు
7. కర్నూలు
8. నంద్యాల
9. చిత్తూరు
10. తిరుపతి
11. అన్నమయ్య
ఈ 11 జిల్లాలలో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు రిపోర్టు వెల్లడించారు. కాబట్టి అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని తెలిపారు. రోడ్లపై వివాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో నేడు వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.
Read also : నేడే బీసీ రిజర్వేషన్లపై విచారణ.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠత!
Read also : ఇదిగో… ఎంగేజ్మెంట్ రింగ్ ఇదేనా?