విజయవాడలో హైందవ శంఖారావం కార్యక్రమం ఘనంగా జరిగింది. కొన్ని వేల మంది హిందువులు ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. రాష్ట్రంలోని పలు గ్రామాల నుండి ఎంతోమంది హిందువులు హైందవ శంఖారావ కార్యక్రమానికి హాజరై తమ హిందుత్వాన్ని చాటుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది దాదాపుగా ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంతో బయలుదేరి వచ్చారు. ప్రతి ఒక్కరి నోటా ‘జైశ్రీరామ్’ అనే నినాదం వినపడుతుంటే అది మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది.
అలా అయితే పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేయండి : YCP అధికార ప్రతినిధి
కృష్ణా జిల్లాలోని విజయవాడ దగ్గర ఉన్నటువంటి కేసరపల్లి లో హైందవ శంఖారావం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి దేశంలో ఉన్నటువంటి హిందూ మత పెద్దలు, గురువులు హాజరు అయ్యారు. అంతేకాకుండా వీళ్ళందరూ కలిసి ప్రభుత్వాలను కొన్ని డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలపై మరియు హిందూ పండగలపై దేశం లోని అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా ఆంక్షలు విధిస్తున్నారు. ఇది సరి కాదంటూ మరికొన్ని డిమాండ్స్ చేశారు. అవేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.
భారత్ లోకి అడుగుపెట్టిన కరోనా!… త్వరలోనే లాక్ డౌన్ రాబోతుందా?
మన దేశంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఇస్తూ చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆలయాల్లో అన్య మత ఉద్యోగులను వెంటనే తొలగించి హిందూ మత ప్రజలను మాత్రమే ఉద్యోగులుగా నియమితం చేయాలని కోరారు. హిందూ ధర్మం పాటించే వాళ్లని మాత్రమే ట్రస్ట్ బోర్డులో సభ్యులుగా నియమించాలని డిమాండ్ చేశారు. అలాగే దేవాలయ నిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించకుండా చూడాలని ప్రభుత్వాలకు సూచించారు.దేశంలో జరుగుతున్నటువంటి హిందూ సాంప్రదాయ పండుగలు అయినటువంటి వినాయక చవితి మరియు దసరా వేడుకలలో ఎలాంటి ఆంక్షలు విధించడం సరికాదని తెలియజేశారు. దేశంలోని హిందూ దేవాలయాలను కూల్చిన ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
వెల్‌కమ్ టు చర్లపల్లి రైల్వే స్టేషన్.. నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ