
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అతను నటించిన లైలా సినిమా డిజాస్టర్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవడంపై హీరో విశ్వక్ సేన్ ఓ లేక విడుదల చేస్తూ స్పందించారు. ఆ లేఖలో ‘ మీరు కోరుకున్న స్థాయికి నా సినిమాలు చేరుకోలేకపోయాయి. లైలా సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను నేను అంగీకరిస్తున్నానని అన్నారు. ఇకపై నా ప్రతి సినిమా అది ఎలా అయినా ఉండని కానీ అందులో అసభ్యతో మాత్రం ఇకపై ఉండదు అని అన్నారు. నా ప్రతి సన్నివేశం మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇకపై త్వరలోనే మరొక బలమైన కథతో మీ ముందుకు వస్తా’ అని ఒక లేఖను విడుదల చేశారు.
జగన్, కొడాలి నానిపై కేసు.. వైసీపీలో టెన్షన్
కాగా ఈ లైలా అనే సినిమా డిజాస్టర్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనికి ఎక్కువగా కారణం వైసీపీ అని, మరి కొంతమంది సినిమాలో కథ బాగా లేదని.. కాబట్టే సినిమా డిజాస్టర్ అయిందని అంటున్నారు. కాగా ఈ లైలా అనే సినిమా విడుదల కాకముందు నుంచి హీరో విశ్వక్సేన్ కు చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమా విడుదల కాక ముందు నుంచే విశ్వక్సేనుకు బ్యాడ్ టైం ఉందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏది ఏమైనా సరే నాకు అలాగే నా సినిమాలకు అభిమానం చూపిస్తున్న నా అభిమానులకు కృతజ్ఞతలు అని విశ్వక్సేన్ ఓలేఖలో రాసుకు వచ్చారు.
జగన్ పై మండిపడ్డ పెమ్మసాని… ఈ సారి ఆ 11 సీట్లు కూడా రావు?