ఆంధ్ర ప్రదేశ్క్రైమ్సినిమా
Trending

ప్రైవేట్ వీడియోల ప్రశ్నలపై స్పందించిన హీరో నిఖిల్!..

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ భార్య లావణ్య పోలీసుల తో మాట్లాడుతున్న విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ కేసులో చాలానే విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ తరుణంలో మస్తాన్ సాయి అనే వ్యక్తి హార్డ్ డిస్క్ ఒకటి పోలీసులకు లావణ్య అందజేసింది. అయితే అంతటితో ఈ విషయం అనేది ఆగిపోలేదు. మస్తాన్ సాయి మీద ఫిర్యాదు చేస్తున్న క్రమంలో లావణ్య మరొక విషయాన్ని బయట పెట్టింది. హీరో నిఖిల్ ప్రైవేట్ వీడియోలు ఆ హార్డ్ డిస్క్ లో ఉన్నాయని ప్రస్తావించింది. దీంతో ఈ అంశం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హీరో నిఖిల్ తాజాగా స్పందించాడు.

హీరోల క్రికెట్ నేడే ప్రారంభం!… సాయంత్రం 6 గంటలకు టాలీవుడ్ మ్యాచ్?

నా మీద జరుగుతున్న ఈ ప్రచారాన్ని నేను ఖండిస్తున్నానని హీరో నిఖిల్ తెలిపారు. తన ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్న వీడియోలను తప్పుగా చూపిస్తున్నారని మండిపడ్డారు. కార్తికేయ 2 సక్సెస్ మీట్ తర్వాత జరిగిన డిన్నర్ పార్టీలోని వీడియోలు అవి అని అన్నారు. వాస్తవం ఏంటి అనేది పోలీసులకు కూడా పూర్తిగా తెలిసు అంటూ ఆయన చెప్పుకోచ్చారు. ఇక మస్తాన్ సాయి అనే వ్యక్తి హార్డ్ డిస్క్లు దాదాపుగా 300 నుంచి 500 మంది అమ్మాయిలు వీడియోలతో పాటుగా పలువురు వ్యక్తుల ప్రైవేటు వీడియోలు కూడా ఉన్నాయని రాజ్ తరుణ్ భార్య లావణ్య ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే హీరో నిఖిల్ ప్రస్తావన కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇక ఈ తరుణంలోనే నిఖిల్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

అద్దంకి దయాకర్ సినిమా టైటిల్ ఫిక్స్.. పాన్ ఇండియా సినిమాకు పవర్ ఫుల్ టైటిల్!!

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉండదు!.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు?

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button