
తెలంగాణలో భానుడి భగభగమంటున్నాడు.ఎండ తీవ్రత తట్టుకోలేక పిట్టల్లా రాలిపోతున్నారు జనాలు. గురువారం ఒక్కరోజే వడదెబ్బతో మరో ఏడుగురు చనిపోయారు. మొత్తంగా గత మూడు రోజుల్లోనే 30 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారంఖమ్మం జిల్లాలో ఇద్దరు, నిర్మల్ జిల్లాలో ఇద్దరు, జగిత్యాల జిల్లాలో ఒకరు, సూర్యాపేట జిల్లాలో ఒకరు, జనగామ జిల్లాలో ఒకరు వడదెబ్బతో మృతి చెందారు.ప్రభుత్వం కనీస అవగాహన కల్పించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ నిపుణులు.
తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత.. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా గురువారం 44 నుంచి 45 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఎండ తీవ్రతకు బుధవారం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు, పెద్దపల్లి జిల్లాలో ఒకరు, ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్కరు, సూర్యాపేట జిల్లాలో ఒక్కరు, నిర్మల్ జిల్లాలో ఒక్కరు, కరీంనగర్ జిల్లాలో ఒక్కరు, వరంగల్ జిల్లాలో ఒక్కరు, జనగామ జిల్లాలో ఒక్కరు, ములుగు జిల్లాలో ఒక్కరు ఎండ తీవ్రతను తట్టుకోలేక మృత్యువాతపడ్డారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ అధికారులు