
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని కొన్ని ముఖ్య నగరాలలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అలాగే పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఒకవైపు భారీ వర్షాలు కురుస్తుండగా… మరోవైపు రాష్ట్రంలోని జలపాతాలు అన్నీ కూడా ఉప్పొంగిపోతూ ప్రవహిస్తున్నాయి. కాగా రాష్ట్రానికి మరో మూడు రోజులు పాటు మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిన సందర్భంలో జలపాతాలు కూడా భారీగానే ఉప్పొంగుతాయని అధికారులు హెచ్చరించారు.
ఇకపై సినిమాల్లో నటించను… కానీ నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలోనే ఉంటాను : పవన్ కళ్యాణ్
మరోవైపు ములుగు జిల్లాల్లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన బొగత జలపాతానికి భారీగా వర్షపు నీరు వచ్చి చేరడం వల్ల వరద ఉధృతి పెరిగిపోయింది. దీంతో బొగత జలపాతానికి వచ్చేటువంటి సందర్శకులును అధికారులు తాత్కాలికంగా కొద్దిరోజులపాటు నిషేధం విధించారు. వర్షాలు తగ్గుముఖం పట్టి… వరద ఉధృతి తగ్గితేనే రావాలని… ఈ వరద ఉధృతి తగ్గే వరకు ఎవరూ కూడా ఈ ప్రాంతానికి రాకూడదని పర్యాటకులను అధికారులు హెచ్చరించారు. అలాగే మరోవైపు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గూడూరు లోని భీముని పాదం జలపాతం ప్రేక్షకులను అలాగే అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులను కనువిందు చేస్తుంది. కాబట్టి రాష్ట్రంలో మరో రెండు మూడు రోజులపాటు భారీగా వర్షాలు ఉండడం వల్ల ఎవరూ కూడా ఇటువంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్ళకండి అని అధికారులు హెచ్చరించారు. ఇంట్లో ఉన్నటువంటి ఈ చిన్న పిల్లలను వర్షంలో తడవనివ్వకుండా అలాగే బయటకు వెళ్ళనివ్వకుండా తల్లిదండ్రులే చూసుకోవాలని హెచ్చరించారు. భారీ వర్షాలు నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ కూడా బయటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.