
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ ర రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రానున్న మరో 2-3 గంటల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, భూపాలపల్లి, కామారెడ్డి, వికారాబాద్, జగిత్యాల, గద్వాల్, నిర్మల్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, మెదక్, నిజామాబాద్, పెద్దపల్లి మరియు సిరిసిల్ల జిల్లాలలో నమస్కార్ నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తేలికపాటి వర్షం నుంచి భారీ వర్షాలతో పాటుగా 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలను కూడా విచ్చేటువంటి అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ప్రజలందరూ రానున్న రెండు, మూడు గంటల పాటు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళద్దని అధికారులు విచరించారు. ఎవరు కూడా కరెంటు స్తంభాలను పట్టుకోవద్దని అధికారులు జాగ్రత్తలు చెబుతున్నారు. తెలంగాణతోపాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అక్కడక్కడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ దరఖాస్తులకు ఆహ్వానం – డిఇఓ రమేష్ కుమార్