
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు ఐదు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఇక ఇవాళ అదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, అసిఫాబాద్, భద్రాద్రి, నల్గొండ జిల్లాల్లో ఉరుములు మరియు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలుపుతూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక మిగతా కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. కాబట్టి రాబోయే ఐదు రోజులపాటు ప్రజలందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఎక్కడైనా సరే కరెంటుకు అంతరాయం కలిగితే వెంటనే విద్యుత్ అధికారులకు తెలియజేయాలని కోరారు. పిల్లలు లేదా పెద్దలు ఎవరైనా సరే తడిసినటువంటి కరెంటు స్తంభాలను ముట్టుకోరాదని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు అని పలు జాగ్రత్తలు సూచించారు. కాబట్టి ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త గా ఉండాలని తెలిపారు.
వన్డే కెప్టెన్ గా గిల్ లేక రోహిత్ శర్మ నా?… మీ అభిప్రాయం ఏంటి ?