
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని జిల్లాలలో వానలు దంచి కొడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ముఖ్య పట్టణాలలో రోడ్లపైనే వర్షం నీరు నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాలకు వర్ష సూచన చేశారు.
తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వర్షం పడుతున్న జిల్లాలు ఇవే:-
1. ఆసిఫాబాద్
2. నిర్మల్
3. కామారెడ్డి
4. జగిత్యాల
5. మంచిర్యాల
6. నిజామాబాద్
ఈ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ అధికారులు ఈ ఆరు జిల్లాల ప్రజలు చాలా అలర్ట్ గా ఉండాలని సూచించారు. ఏదైనా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.
Read also : పులివెందుల ఎమ్మెల్సీ పై దాడి.. వడ్డీతో సహా చెల్లిస్తాం : జగన్
మరికొద్ది గంటల్లో వర్షం పడబోయే జిల్లాలు ఇవే :-
1. ఖమ్మం
2. సిద్దిపేట
3. మహబూబాబాద్
4. జనగాం
5. వరంగల్
6. హనుమకొండ
7. భద్రాద్రి
8. ములుగు
ఈ ఎనిమిది జిల్లాలలో రాబోయే మరికొద్ది గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కాబట్టి ఈ 8 జిల్లాల ప్రాంత ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్లే కార్యక్రమాలు ఏమైనా ఉంటే మరి కొద్ది గంటల్లోపే చూసుకోవాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పలు జిల్లాలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కడప మరియు ఏలూరు జిల్లాలో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. ఇక విశాఖపట్నంలో కూడా అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని.. కరెంటు స్తంభాల వైపు, విద్యుత్ తీగలను, ఆరుబయట వర్షంలో ఎక్కువగా ప్రయాణాలు చేయకండి అని అధికారులు సూచించారు.
Read also: అరువు తెచ్చుకున్న జనాలతో జగన్ శాంతి భద్రతలకు సమస్యలు సృష్టిస్తున్నారు : బీజేపీ అధ్యక్షుడు