
– ఏపీలో భారీ వర్షాలు…
– రాయలసీమ ప్రజలు జాగ్రత్త!…
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలలో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉండడంతో… రాయలసీమ ప్రాంత ప్రజలు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని ఎన్టీఆర్, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, నెల్లూరు జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాలు అన్నిట్లల్లో కూడా… మోస్తారు నుంచి భారీ ఎత్తున వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. అలాగే మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం మరియు అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. తద్వారా అన్ని జిల్లాల ప్రజలు కూడా ముందస్తు చర్యలలో భాగంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని APSMDA కీలక ప్రకటన చేసింది. పెద్ద పెద్ద చెట్లు కింద, కరెంటు స్తంభాల దగ్గర, లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఏదైనా అత్యవసరమైన పని తప్పితే తప్ప… మామూలు పనులకు బయటకు రాకూడదని అధికారులు సూచించారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ మధ్య వరుసగా వర్షాలు కురిసిన విషయం మనందరికీ తెలిసిందే.
కూతురిని హత్తుకుని… ఎమోషనల్ అయిన భారత్ స్టార్ బౌలర్!
భీమవరం బుల్లోడిగా నితీష్ కుమార్ రెడ్డి.. రసవత్తరంగా సాగునున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్