
-
హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
-
రాజధానిలో దంచికొట్టిన వాన, వాహనదారుల ఇక్కట్లు
-
అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ, జలమండలి, హైడ్రా ఫోర్స్
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్‌పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, యాచారం, శేరిలింగంపల్లి, శంషాబాద్, రాజేంద్రనగర్, మెహిదీపట్నం, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. పలు చోట్ల రోడ్లు జలమయ్యాయి. ఓఆర్‌ఆర్‌పై భారీ వర్షం కురవడంతో జలపాతం మాదిరిగా వరద నీరు కిందకు పారింది. భారీ వర్షం కారణంగా రోడ్లు చెరువులను తలపించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్స్, జలమండలి, హైడ్రా ఫోర్స్ రంగంలోకి దిగాయి. అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాయి.
వాతావరణ శాఖ హెచ్చరికలు
భారీ వర్షాల పట్ల వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉరుములు, మెరుపులతో వాన పడే ఛాన్స్ ఉందని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దన్న జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు.
నడిరోడ్డుపై కూలిన భారీ వృక్షం
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో వర్షం దంచికొట్టింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి హయత్‌నగర్-మునగనూరు రోడ్డులో భారీ వృక్షం నేలకూలింది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్టు నేలకూలిన సమయంలో అటువైపు వాహనాలేవీ రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. భారీ వృక్షం నేలకూలడంతో కరెంట్ సరఫరాకు అటంకం కలిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు, మున్సిపల్ సిబ్బంది హుటాహుటిన చెట్టును తొలగించారు.
Read Also: