
-
లోతట్టు ప్రాంతాలు జలమయం
-
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: రాజధాని నగరంలో వాన దంచికొడుతోంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, రోడ్లపై ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలని సూచించారు.
ఇవాళ మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై ఉంది. వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోఠి, నారాయణగూడ, హిమాయత్‌నగర్, నాంపల్లి, ఖైరతాబాద్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.
మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి బలపడింది. దీని ప్రభావంతో రెండురోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించింది.
Read Also:
-
తీరిన రాయలసీమ ప్రజల చిరకాల వాంఛ… హంద్రీనీవా ఫేజ్-1 పంపింగ్ షురూ
-
తన సినిమాలలో.. తనకు నచ్చిన మూవీ ఏదో చెప్పేసిన జక్కన్న!
-
బస్సు కోసం విద్యార్థుల బాధలు… రోడ్ల మీద వాహనాలను ఆపుతూ ఇబ్బందులు
-
తెలంగాణలో మాజీ సర్పంచ్‌ల గోస… కరీంనగర్ జిల్లాలో ఓ సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం
-
తీరిన రాయలసీమ ప్రజల చిరకాల వాంఛ… హంద్రీనీవా ఫేజ్-1 పంపింగ్ షురూ