
క్రైమ్ మిర్రర్, భూపాలపల్లి బ్యూరో:- తెలంగాణలోని జయశంకర్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము నుండి భారీ వర్షం కురుస్తోంది. మరికొన్నిచోట్ల బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శనివారం మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్నప్పటికీ.. సాయంత్రం కల్లా పూర్తిగా మారిపోయింది. ఆదివారం తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలైంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విపరీతమైన ఎండలు అలాగే ఊహించని సమయంలో వర్షాలు కూడా దంచి కొడుతున్నాయి. దీంతో ఉదయం నుంచి ఈ మధ్యాహ్నం వరకు ఎండలో పనిచేసిన వారికి సాయంత్రం మంచిగా ఉపశమనం లభిస్తుంది.