
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- కేవలం ఒక కుక్క అరుపుల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లో ఏకంగా 70 మంది ప్రాణాలతో బయటపడ్డారు. అవును మీరు విన్నది నిజమే… హిమాచల్ ప్రదేశ్లో ఋతుపవనాల కారణంగా ఈ మధ్య భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలలో ఇల్లు మునిగిపోగా మరికొన్ని ప్రాంతాలలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆకస్మిక వరదల కారణంగా పదుల సంఖ్యలో ప్రాణాలను కూడా కోల్పోయారు. కానీ హిమాచల్ ప్రదేశ్ లోని మండి అనే జిల్లాలో అర్ధరాత్రి ఒక కుక్క అరుపుల కారణంగా ఏకంగా 67 మంది ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. మరో ముగ్గురు గాయాలతో ప్రాణాలను దక్కించుకున్నారు. జూన్ 30 అర్ధరాత్రి జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
హిమాచల్ ప్రదేశ్ లోని చాలా ప్రాంతాలలో భారీగా వరదలు ముంచెత్తాయి. ఇక మండి జిల్లా ధర్మపురి ప్రాంతంలోని సీయాతి అనే గ్రామం కూడా వరదలకు తీవ్రంగా ప్రభావితానికి గురైంది. అయితే అర్ధరాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ నిద్రపోతుండగా… నరేంద్ర అనే ఒక వ్యక్తి ఇంట్లోని కుక్క అరుపులకు ఏం జరిగిందో అని బయటికి వచ్చి చూడగా. ఇంటి గోడల్లో పగుళ్లు కనిపించడం అలాగే భారీగా నీరు ఇంటి వైపుకు రావడం చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే అతని కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఇళ్లలోని ప్రతి ఒక్కరిని లేపి సురక్షిత ప్రాంతానికి పారిపోయేలా చేశాడు. ఆ తరువాత కొద్దిసేపటికే గ్రామం మొత్తం మీద కూడా కొండ చర్యలు విరిగిపడి పదుల సంఖ్యలో ఇల్లు నేలమట్టమయ్యాయి. దీంతో ప్రతి ఒక్కరూ కుక్క కారణంగానే బ్రతికామని ఊపిరి పీల్చుకున్నారు.
ముందుకు రాని సినిమా రంగం.. భరోసా ఇచ్చిన మంత్రి శ్రీహరి!.. ప్రస్తుతం నో టెన్షన్?